వచ్చే ఉగాది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాల లిస్ట్ ఇదే..!

వచ్చే ఉగాది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాల లిస్ట్ ఇదే..!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరుగుతాయి, అందుకే తిరుమల కొండను  నిత్య కల్యాణం-పచ్చతోరణం..  అంటారు. ప్రధాన ఉత్సవం సెప్టెంబర్​ లేదా  అక్టోబర్ నెలల్లో జరిగే  ..శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటితో పాటు  రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవాలు, ఉగాది ఆస్థానం,  పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి పరాభవ నామ సంవత్సరంలో ఎప్పుడు ఏ ఉత్సవం జరుగుతుందో తెలుసుకుందాం. . .!

తిరుమల ఉత్సవాలు.. వివరాలు ఇవే..! 

  • మార్చి 27 : శ్రీరామనవమి, ఆస్థానం
  • మార్చి 28 : శ్రీరామపట్టాభిషేకం ఆస్థానం.
  • మార్చి 30 : శ్రీవారి వసంతోత్సవారంభం
  • మార్చి 31 : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణం
  • ఏప్రిల్ 01: వసంతోత్సవ సమాప్తి
  • ఏప్రిల్ 25: తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ప్రారంభం
  • ఏప్రిల్ 27: తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం సమాప్తి
  • జూన్ 26 : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం
  • జూన్ 28 : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తి
  • జులై 17 : తిరుమల శ్రీవారి ఆణివరై ఆస్థానం, తిరుమల శ్రీవారి పుష్పపల్లకి సేవ
  • సెప్టెంబర్ 15: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవారంభము,
  • సెప్టెంబర్ 19 : శ్రీవారి గరుడ సేవ
  • సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ సమాప్తి
  • అక్టోబర్ 12 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవారంభము
  • అక్టోబర్ 16 : శ్రీవారి గరుడ సేవ
  • అక్టోబర్ 20 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ సమాప్తి
  • నవంబర్ 16: తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవము
  • డిసెంబర్ 16: ధనుర్మాసారంభం ధనుర్మాస పూజ
  • డిసెంబర్ 09: తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవ ప్రా॥
  • డిసెంబర్ 20 : ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 

2027

  • జనవరి 02 : తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవ సమాప్తి ఉత్తరద్వార దర్శనం
  • ఫిబ్రవరి 13 : రథసప్తమి, వాహన సేవలు
  • మార్చి 18 : తిరుమల శ్రీవారి తెప్పోత్సవ సమాప్తి